: రిటైల్ స్టోర్లలో అందుబాటులోకి వచ్చిన జియోమి ఎంఐ 4, రెడ్ మీ నోట్


నిన్నటివరకూ ఫ్లిప్ కార్ట్ వెబ్ సైట్లో మాత్రమే అందుబాటులో ఉన్న జియోమీ స్మార్ట్ ఫోన్ లు ఎంఐ 4, రెడ్ మీ నోట్ 4జీలు రిటైల్ స్టోర్లలో అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతానికి కొద్దిమేరకే స్టాక్ అందుబాటులో ఉందని, ఢిల్లీ లోని 'మొబైల్ స్టోర్' కేంద్రాల్లో అమ్మకానికి ఉంచామని సంస్థ తెలిపింది. ఫ్లిప్ కార్ట్ లో ఎంఐ 4 (16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్) ధర రూ. 19,999, రెడ్ మీ నోట్ ధర రూ. 9,999 రూపాయలు కాగా, అదే ధరకు రిటైల్ స్టోర్లలో అమ్మనున్నట్టు పేర్కొంది. డిమాండ్ కు తగ్గ సరఫరా చేసేందుకు కృషి చేస్తున్నట్టు సంస్థ తెలిపింది.

  • Loading...

More Telugu News