: గిన్నిస్ రికార్డు గ్రహీత మస్తాన్ బాబు అదృశ్యం


పర్వతారోహణలో గిన్నిస్ రికార్డు నెలకొల్పిన మస్తాన్ బాబు అదృశ్యం అయ్యారు. చిలీలో పర్వతాన్ని అధిరోహించేందుకు వెళ్ళిన మస్తాన్ బాబు ఆచూకీ రెండు రోజులుగా తెలియడం లేదని బంధువులు ఆందోళన చెందుతున్నారు. ఈ మేరకు చిలీలోని ఇండియన్ ఎంబసీకి సమాచారం అందించారు. 172 రోజుల్లో 7 ఖండాల్లోని పర్వతాలను అధిరోహించి మస్తాన్ బాబు గిన్నిస్ రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. ఆయన ఆచూకీ కోసం ఎంబసీ అధికారులు ఆరా తీస్తున్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News