: బీకే బిర్లా సతీమణి సరళా బిర్లా కన్నుమూత
ప్రముఖ పారిశ్రామికవేత్త బీకే బిర్లా సతీమణి సరళా బిర్లా (91) కన్నుమూశారు. నిన్న ఢిల్లీలోని ఆమె నివాసంలో భర్త సమక్షంలోనే ఆమె తుది శ్వాస విడిచారు. వయసు మీదపడడంతో ఆమె కొన్ని సమస్యలతో బాధపడుతున్నారని తెలుస్తోంది. సరళా బిర్లా అంత్యక్రియలు నేడు కోల్ కతాలో జరగనున్నాయి. బిర్లా దంపతుల ఏకైక కుమారుడు ఆదిత్య విక్రమ్ బిర్లా ఇదివరకే మరణించిన సంగతి తెలిసిందే. ఆమెకు ఇద్దరు కుమార్తెలు మంజుశ్రీ ఖైతాన్, జోయ్‌శ్రీ మెహతా ఉన్నారు. స్వాతంత్య్ర సమరయోధుడు బ్రిజలాల్ బియానీ, సావిత్రి దేవీ బియానీ దంపతులకు నవంబరు 23, 1924న రాజస్థాన్ లోని కుచ్చమాన్ లో సరళ జన్మించారు.