: భారత ఫ్యాన్స్ కు మెక్ కల్లమ్ లేఖ పూర్తి పాఠం ఇదిగో...


మొన్నటికి మొన్న సఫారీలతో సెమీస్ కు ముందు ఆక్లాండ్ వాసులకు లేఖ రాసిన కివీస్ కెప్టెన్ బ్రెండన్ మెక్ కల్లమ్ ఈసారి భారత ఫ్యాన్స్ పై దృష్టి పెట్టాడు. ఆస్ట్రేలియా జట్టుతో ఫైనల్ సందర్భంగా భారత అభిమానులు తమకు మద్దతుగా నిలవాలంటూ ఓ లేఖ రాశాడు. ఆ లేఖ పూర్తి పాఠం ఇదిగో... భారత్ లోని ప్రతి ఒక్క క్రికెట్ అభిమానికి... వరల్డ్ కప్ నెగ్గాలన్న మా బలమైన ఆకాంక్ష మీకర్థమైందని నాకు తెలుసు. మీరు మాపై చూపే వల్లమాలిన అభిమానం నాకు కొత్తేమీ కాదు. థాంక్ యూ! ప్రతి బంతికీ ప్రోత్సహించడం ద్వారా, ఫైనల్లో అన్ని అంశాల్లో న్యూజిలాండ్ కు మద్దతివ్వాలని కోరుతున్నా. ఇది మా కెరీర్లోనే అతి పెద్ద మ్యాచ్. వందల కోట్ల గొంతుకల మాకోసం నినదిస్తుంటే, ఆ ప్రభావం తప్పక కనిపిస్తుంది. మీ... బ్రెండన్ మెక్ కల్లమ్

  • Loading...

More Telugu News