: నా పర్యటనతో ఆర్థిక వ్యవస్థ బలోపేతం...నిరుద్యోగ సమస్యకు పరిష్కారం: మోదీ
తన విదేశీ పర్యటనలతో భారత్ ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందని ప్రధాని నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. విదేశీ పర్యటనపై ఆయన ట్వీట్ చేశారు. దేశంలో నిరుద్యోగ సమస్యకు కొంత పరిష్కారం దొరుకుతుందని అభిప్రాయపడ్డారు. 9 నుంచి 16 వరకు ఫ్రాన్స్, జర్మనీ, కెనడా దేశాల్లో పర్యటించనున్నట్టు తెలిపారు. ఏప్రిల్ 9 ఫ్రాన్స్ కు, 12న జర్మనీకి, 14 కెనడాలో పర్యటించనున్నారు. పారిస్ వెలుపల హైటెక్ పారిశ్రామిక యూనిట్లు పరిశీలించనున్నారు. భారత్, జర్మనీ సంయుక్తంగా చేపట్టనున్న హన్నోవర్ మెస్సే ప్రాజెక్టును జర్మనీ ఛాన్సెలర్ ఏంజెలా మోర్కెల్ తో కలిసి శంకుస్థాపన చేయనున్నారు. కెనడాలో రాజకీయవేత్తలు, ప్రవాస భారతీయులు, పారిశ్రామిక వేత్తలను కలవనున్నారు.