: గుంటూరు జిల్లాలో కిరాతకం
గుంటూరు జిల్లా బాపట్లలో దారుణం చోటుచేసుకుంది. ఆటోలో వచ్చిన గుర్తు తెలియని ఆగంతుకులు ఓ వ్యక్తిపై విచక్షణా రహితంగా ఇనుప రాడ్లతో దాడికి దిగారు. అనంతరం అతని గొంతు కోసి పరారయ్యారు. దీంతో స్థానికులు అతనిని ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడడంతో అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. కాగా, దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు ప్రారంభించారు.