: 10,330 టీచర్ పోస్టులు భర్తీ చేస్తాం: గంటా


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నాలెడ్జ్ హబ్ గా తయారు చేస్తామని విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. తిరుపతిలో ఆయన మాట్లాడుతూ, డిఎస్సీ ద్వారా 10,330 ఉద్యోగాలు భర్తీ చేస్తామని అన్నారు. లోటుబడ్జెట్ లో ఉన్నప్పటికీ విద్యాశాఖకు 19 వేల కోట్ల రూపాయలు కేటాయించామని ఆయన పేర్కొన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఉపాధ్యాయుల కొరత లేకుండా చూస్తామని ఆయన చెప్పారు. కేంద్రం విడుదల చేసిన 225 కోట్ల రూపాయల్లో శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీకి 20 కోట్లు, చిత్తూరు జిల్లాలోని ఐదు డిగ్రీ కళాశాలల అభివృద్ధికి 2 కోట్ల రూపాయల చొప్పున కేటాయించామని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News