: వరల్డ్ కప్ ఫైనలే క్లార్క్ కు చివరి మ్యాచా?
ఆస్ట్రేలియా కెప్టెన్ మైకేల్ క్లార్క్ వన్డేల నుంచి తప్పుకోనున్నాడా? అవుననే అంటున్నాయి సీఏ వర్గాలు. క్రికెట్ ఆస్ట్రేలియా వర్గాల అంచనా ప్రకారం వన్డేలకు క్లార్క్ గుడ్ బై చెప్పనున్నట్టు సమాచారం. వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ముగిసిన తరువాత క్లార్క్ వన్డేల నుంచి తప్పుకోనున్నట్టు ప్రకటన చేసే అవకాశముందని వారు భావిస్తున్నారు. కాగా, క్లార్క్ గత కొంత కాలంగా ఫిట్ నెస్ సమస్యలతో ఇబ్బందిపడుతున్నాడు. పాంటింగ్ నుంచి పగ్గాలు చేపట్టిన క్లార్క్ సమర్థవంతంగా జట్టును నడిపాడు. వన్డేల నుంచి తప్పుకుని టెస్టుల్లో కొనసాగాలని క్లార్క్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.