: సంప్రదాయపాత్రలే వచ్చాయి...గ్లామర్ పాత్రల్లో చేయాలనుంది: మాధవీలత


తనకు ఇప్పటి వరకు సంప్రదాయపాత్రలే వచ్చాయని, గ్లామర్ పాత్రలు కావాలని సినీ నటి మాధవీలత కోరింది. తొలి సినిమాలో గ్లామర్ పాత్రను ధరించినప్పటికీ, చిత్రీకరణ హుందాగా ఉండడంతో తనను సంప్రదాయపాత్రలకు పరిమితం చేసేశారని బాధపడిపోయింది. గ్లామర్ పాత్రల్లో ఎంత అద్భుతంగా కనిపిస్తానన్న విషయాన్ని నిరూపిస్తూ త్వరలోనే ఓ మంచి ఫోటోషూట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తానని చెప్పింది. వ్యక్తిత్వం ఉన్న వాళ్లు సినీపరిశ్రమలో రాణించడం కాస్త కష్టమని మాధవీలత అభిప్రాయపడింది. సినిమాలంటే ఉన్న అభిమానంతో ఈ రంగంలోకి వచ్చినప్పటికీ వ్యక్తిత్వం కోల్పోకుండా జాగ్రత్తగా ఉండడంతో పొగరున్న అమ్మాయిగా ముద్రపడిపోయానని మాధవీలత చెప్పింది. తమిళ, మలయాళ సినిమాల్లో నటిస్తున్నానని చెప్పింది.

  • Loading...

More Telugu News