: మేమెవరి సొత్తన్నా లాక్కెళ్లిపోతున్నామా?... సేవ చేద్దామంటున్నాం: రాజేంద్రప్రసాద్


సేవ చేసేందుకు'మా' అధ్యక్ష పదవిని కోరుకుంటే... మేమెవరిదో సొత్తు లాక్కెళ్లిపోతున్నట్టు చాలా మంది భాధపడిపోతున్నారని నటుడు రాజేంద్రప్రసాద్ విమర్శించారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ, నెల రోజుల క్రితం 'మా' అధ్యక్షపదవికి పోటీ చేస్తానని బహిరంగంగా చెప్పానని అన్నారు. తాను పోటీ చేస్తానని, తనను ఎన్నుకుంటే ఏం చేస్తానో బహిరంగంగా, నిజాయతీగా చెప్పిన తరువాత, తనపై లేనిపోని ఆరోపణలు చేయడం సమంజసం కాదని రాజేంద్రప్రసాద్ హితవు పలికాడు. తనపై ఆరోపణలు చేస్తున్న నటీనటులు సేవ చేయడానికే తాను వస్తున్నానన్న విషయం గుర్తించాలని సూచించాడు. వ్యక్తిగత విమర్శలకు దిగడం సరికాదని, తాను మీడియా ముందుకు వచ్చినప్పుడే 150 మంది పేద కళాకారులకు ఇన్సూరెన్స్ చేయిస్తానని చెప్పిన విషయం గుర్తుంచుకోవాలని స్పష్టం చేశారు. కళాకారులం... అబద్ధాలు ఆడాల్సిన అవసరం లేదని, అలా చేస్తే నటరాజు ఆగ్రహిస్తాడని రాజేంద్రప్రసాద్ తెలిపాడు.

  • Loading...

More Telugu News