: తెలంగాణలో పెరిగిన విద్యుత్ ఛార్జీలు... గృహ వినియోగదారులకు స్వల్ప ఊరట


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోలానే తెలంగాణలోనూ కొత్త విద్యుత్ టారిఫ్ ప్రకటించారు. తెలంగాణలో విద్యుత్ ఛార్జీల పెంపు టారిఫ్ ఆర్డర్ ను ఈఆర్సీ ఛైర్మన్ ఇస్మాయిల్ అలీఖాన్ విడుదల చేశారు. ఓవరాల్ గా 4.42 శాతం మేర ఛార్జీలు పెంచినట్టు మీడియాకు చెప్పారు. గృహ అవసరాల విద్యుత్ పై 200 యూనిట్లు దాటితే 1.3 శాతం పెంపు వర్తిస్తుంది. కాగా, కుటీర పరిశ్రమలకు విద్యుత్ ఛార్జీల పెంపు లేదని ఈఆర్సీ ఛైర్మన్ వెల్లడించారు. అయితే, గృహ అవసరాల విద్యుత్ పై మొదటి 200 యూనిట్ల వరకు పాత విద్యుత్ ఛార్జీలే అమలవుతాయని చెప్పారు. అంతకుమించితే పెంపు వర్తిస్తుందని వివరించారు. విద్యుత్ సంస్థలకు ప్రభుత్వం రూ.4,227 కోట్లు రాయితీ ఇవ్వనుంది. అటు, కోళ్ల పరిశ్రమకు రూ.30 కోట్లు రాయితీ ప్రకటించారు.

  • Loading...

More Telugu News