: వాజ్ పేయీకి భారతరత్న పురస్కారం ప్రదానం చేసిన రాష్ట్రపతి


భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయీకి భారతరత్న పురస్కారాన్ని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రదానం చేశారు. అనారోగ్యంతో ఇంటికే పరిమితమైన బీజేపీ కురువృద్ధుడు అటల్ బిహారీ వాజ్ పేయీ నివాసానికి వెళ్లిన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆయనకు పురస్కారం అందజేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, ఎంపీలు హాజరయ్యారు. రాష్ట్రపతి భవన్ లో భారతరత్న పురస్కారం ప్రదానం చేయడం ఆనవాయతీ. అయితే, వాజ్ పేయీ అనారోగ్యం కారణంగా, సంప్రదాయాలను తోసిరాజని రాష్ట్రపతి మాజీ ప్రధాని నివాసానికి వెళ్లి భారతరత్న పురస్కారం అందజేయడం విశేషం. మాజీ ప్రధాని వాజ్ పేయీని అభిమానించని రాజకీయ నాయకుడు లేడంటే అతిశయోక్తి కాదు. ఆయన వాగ్ధాటికి ముగ్ధులు కాని శ్రోతలు ఉండరంటే అతిశయోక్తి కాదు. పార్టీలకతీతంగా ఆయనకు అభిమానులున్నారు.

  • Loading...

More Telugu News