: సీఆర్పీఎఫ్ జవాన్లే లక్ష్యంగా బాంబులు పేల్చిన మావోయిస్టులు
సీఆర్పీఎఫ్ దళాలను లక్ష్యంగా చేసుకుని ఛత్తీస్ గఢ్ లో మావోయిస్టులు వేర్వేరు ప్రాంతాలలో బాంబులు పేల్చారు. ఈ ఘటనల్లో ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. ఈ ఘటనలు బీజాపూర్ జిల్లా ఫండ్రీ గ్రామ సమీపంలో జరిగాయి. మావోయిస్టుల కోసం జవాన్లు గాలింపు చర్యలు చేపడుతుండగా, దాన్ని గమనించిన మావోలు ఆ ప్రాంతంలో ముందుగానే అమర్చిన బాంబులను పేల్చారు. గాయపడిన వారిని బీజాపూర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. వీరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్య చికిత్స కోసం హెలికాప్టర్ లో రాయ్ పూర్ కు తరలించారు. ఈ ఘటన తరువాత గాలింపు చర్యలు తీవ్రతరం చేసినట్లు పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు.