: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి సోనియా ఘాటు లేఖ
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి ఘాటైన వ్యాఖ్యలతో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ లేఖ రాశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రతిపాదించిన భూ సేకరణ సవరణ బిల్లుపై బీజేపీ నేతలు చర్చకు ఆహ్వానిస్తుండడాన్ని ఆమె తప్పుబట్టారు. భూ సేకరణకు సంబంధించి తీసుకొచ్చిన వివాదస్పద చట్టంపై ఏకాభిప్రాయం సాధించేందుకు బీజేపీ నేతలు చర్చకు ఆహ్వానించడం సంప్రదాయాన్ని అపహాస్యం చేసినట్టేనన్నారు. ఎన్డీయే సర్కారు రైతు వ్యతిరేకిలా వ్యవహరిస్తోందని ఆరోపించారు. రైతుల హక్కులను కాలరాసి పారిశ్రామిక వేత్తలకు ప్రయోజనం దక్కేలా కేంద్రం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఈ బిల్లులో కేంద్రం చేయబోతున్న సవరణలను కాంగ్రెస్ ఆమోదించదని సోనియా స్పష్టం చేశారు.