: కేసీఆర్పై కోపాన్ని దేవీప్రసాద్ పై చూపారు: ఎర్రబెల్లి


టీఆర్ఎస్ పార్టీ, ముఖ్యంగా కేసీఆర్ ఒంటెద్దు పోకడలు, నిరంకుశ వైఖరిపై ప్రజలు తమ కోపాన్ని ఉద్యమ నేత దేవీప్రసాద్ పై చూపించారని తెలంగాణ టీడీపీ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకరరావు అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా కేసీఆర్ కు ప్రజలు తగిన బుద్ధి చెప్పారని ఆయన అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ఒక్క సమస్యను కూడా ఆయన పరిష్కరించలేదని, ప్రజల్లో కేసీఆర్ పై కోపమే దేవీప్రసాద్ ఓటమికి కారణమని అన్నారు. అధికార పక్ష సభ్యులు అసెంబ్లీలో ప్రజాసమస్యలపై చర్చను మర్చిపోయారని మండిపడ్డారు. ఇక, తాము క్షమాపణ చెబుతామని చెప్పినా సభాపతి పట్టించుకోలేదని, జాతీయగీతం సందర్భంగా జరిగిన గొడవ వీడియో ఫుటేజీలను బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. సమస్యలపై నిలదీస్తామనే భయంతోనే తమను అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారని ఎర్రబెల్లి ఆరోపించారు.

  • Loading...

More Telugu News