: తన ఆస్తుల చిట్టాను స్పీకర్ కు అందజేసిన ఏపీ సీఎం చంద్రబాబు


నీతిమంతమైన పాలనను అందిస్తానని శపథం చేసిన టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు మరోమారు తన సచ్ఛీలతను చాటుకున్నారు. ఏటా తన ఆస్తుల వివరాలను అసెంబ్లీకి సమర్పిస్తున్న ఆయన ఈ ఏడాదికి సంబంధించిన ఆస్తుల చిట్టాను స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు అందజేశారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా చివరి రోజు సమావేశమైన సభలో కొద్దిసేపటి క్రితం చంద్రబాబు తన ఆస్తుల వివరాలను స్పీకర్ కు అందజేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఏటా తన ఆస్తులను వెల్లడిస్తానని, మిగిలిన ఎమ్మెల్యేలు కూడా ఈ సంప్రదాయాన్ని పాటించాలని ఆయన గతంలో పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News