: హరీష్ రావుపై టీడీపీ హక్కుల ఉల్లంఘన నోటీసు


తెలంగాణ శాసనసభా వ్యవహారాల శాఖమంత్రి హరీష్ రావుపై తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఈ ఉదయం సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు. సభలో తాను లేకపోయినా జాతీయ గీతాన్ని అవమానించినట్లు సభ్యులను, సభాపతిని తప్పుదారి పట్టించారని నోటీసులో ఆరోపించారు. తనపై కక్షతో సస్పెండ్ చేయించినట్టు తెలిపారు. ఈ మేరకు సండ్ర వెంకట వీరయ్య అసెంబ్లీ స్పీకర్ కు సభా హక్కుల నోటీసు ఇచ్చారు. కాగా, అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా గవర్నర్ ప్రసంగ సమయంలో జాతీయ గీతం వినిపిస్తుండగా విపక్ష సభ్యులు నిరసన తెలుపుతూ బల్లలు ఎక్కిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News