: మార్కెట్ ధరకు ఎల్పీజీ కొనే స్తోమత ఉన్నవాళ్లు రాయితీ వదులుకోవాలి: మోదీ
ఎల్పీజీ రాయితీ వదులుకునే ప్రోత్సాహక కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఢిల్లీలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మార్కెట్ ధరకు ఎల్పీజీ కొనే స్తోమత ఉన్నవాళ్లు రాయితీ వదులుకోవాలన్నారు. ఇప్పటివరకు 2.8 లక్షల మంది ఎల్పీజీ రాయితీ వదులుకున్నారని తెలిపారు. ఎల్పీజీ రాయితీ వదులుకోవటం వల్ల రూ.100 కోట్లు ఆదా అయిందని చెప్పారు. నాలుగేళ్లలో కోటి కుటుంబాలకు పైపుల ద్వారా వంటగ్యాస్ కనెక్షన్ అందిస్తామన్న ప్రధాని, అభివృద్ధికి ఇంధన రంగం స్వావలంబన అత్యవసరమని పేర్కొన్నారు. నగదు బదిలీతో వంటగ్యాస్ రాయితీలో లీకేజిని అరికట్టామని వివరించారు.