: నాటి సాహూనే నేటి 'ఆలయాల' దొంగ
ఇటీవలి కాలంలో ఆలయాలలో వరుస దొంగతనాలు చేస్తున్న వ్యక్తి ఆచూకీని పోలీసులు కనిపెట్టారు. 1998లో విజయవాడ కనకదుర్గ గుడిలో చోరీ చేసిన ప్రకాశ్ కుమార్ సాహునే తాజా గుడి దొంగతనాల్లో నిందితుడని గుర్తించారు. సాయిబాబా ఆలయంలో కూడా సాహూనే చోరీకి పాల్పడినట్టు తేల్చారు. ఇతనిపై ఇప్పటికే పలు కేసులు పెండింగ్ లో ఉన్నాయని, దొరక్కుండా తప్పించుకు తిరుగుతూ దేవాలయాల్లో దొంగతనాలకు పాల్పడుతున్నాడని పోలీసులు తెలిపారు. నిందితుడు సాహు కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు పోలీసులు వివరించారు.