: కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం... నలుగురు మృత్యువాత


ఏపీలోని కడప జిల్లాలో నేటి తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని రాజంపేట మండలం బోయనపల్లి వద్ద చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు మృత్యువాతపడ్డారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. చెన్నై నుంచి బయలుదేరిన కడప వాసుల కారును బోయనపల్లి వద్ద సిమెంట్ లోడుతో వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులోని నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే చనిపోయారు. మరణించిన వారితో పాటు క్షతగాత్రులు కడప నగరానికి చెందినవారుగా పోలీసులు గుర్తించారు. క్షతగాత్రులను పోలీసులు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

  • Loading...

More Telugu News