: ఆదిలాబాదులో కొలువు... హైదరాబాదులో అక్రమాస్తుల గుట్టలు: డ్రగ్ కంట్రోల్ అధికారిపై ఏసీబీ దాడి


ఆయన గారు పనిచేసేది ఆదిలాబాదులో. ఆస్తులు కూడబెట్టింది మాత్రం రాజధాని హైదరాబాదులో. ఔషధ తనిఖీ, నియంత్రణ మండలిలో అసిస్టెంట్ డ్రగ్ కంట్రోలర్ గా పనిచేస్తున్న గోపాల్ ఇంటిపై అవినీతి నిరోధక శాఖ తనిఖీల సందర్భంగా ఈ విషయం వెల్లడైంది. ఆదిలాబాదు జిల్లాలో పనిచేస్తున్న గోపాల్, భారీ ఎత్తున లంచాలు స్వీకరిస్తున్నారన్న ఫిర్యాదులతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు నేటి ఉదయం ఆయన ఇంటిపై దాడులు చేశారు. దాడుల్లో భాగంగా గోపాల్ పెద్ద ఎత్తున అక్రమాస్తులను పోగేశారని తేలింది. హైదరాబాదులోని దిల్ సుఖ్ నగర్ ప్రాంతంలో ఏకంగా షాపింగ్ కాంప్లెక్స్ లను గోపాల్ కలిగి ఉన్నారని ఏసీబీ అధికారులు తేల్చారు. ఇంకా కొనసాగుతున్న తనిఖీల్లో మరిన్ని అక్రమాస్తులు వెలుగు చూసే అవకాశాలున్నాయని ఏసీబీ అధికారులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News