: పుట్టెడు దుఃఖంలో పరీక్ష రాసిన చిట్టితల్లి!
తెల్లారితే పరీక్ష...ఇంతలో తల్లి మృతి చెందింది. ప్రపంచంలో ఇంత పెద్దకష్టం పగవాడికి కూడా రాకూడదని కోరుకునేంత విషాదం 10వ తరగతి విద్యార్థికి వచ్చింది. కడప జిల్లా గోపవరం మండలం నీరుబ్దుల్లాయపల్లె గ్రామానికి చెందిన వసంత స్థానిక పాఠశాలలో పదవ తరగతి చదువుతోంది. ఆమె తల్లి వెంకటాయమ్మ బుధవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందింది. దీంతో వసంత పుట్టెడు దుఃఖంలో మునిగిపోయింది. 'బాగా చదువుకుని బాగుపడాలి తల్లీ' అని వెంకటమ్మ మాటలను గుర్తుంచుకున్న వసంత, తల్లి కోరిక నెరవేరాలని పుట్టెడు దుఃఖంలోనే పరీక్షకు హాజరైంది. అనంతరం తల్లి అంత్యక్రియల్లో పాల్గొంది.