: పని, చదువు మధ్యలో నిద్రపోవడం మంచిదేనట!


చదువుకుంటూ, కంప్యూటర్ పై పనిచేస్తూ మధ్యమధ్యలో నిద్రపోవడం చాలా మందికి అలవాటుగా ఉంటుంది. ఆ అలవాటు మంచిదేనని జర్మనీలోని సార్లాండ్ యూనివర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు. అదేపనిగా చేస్తున్న పని మధ్యలో 40 నుంచి 60 నిమిషాల నిద్ర మంచిదేనని వారు స్పష్టం చేస్తున్నారు. అలా చేయడం వల్ల మెదడు పనితీరు మరింత మెరుగుపడుతుందని వారు వెల్లడించారు. అంతే కాకుండా అంతకు ముందు చేసిన పని మరింత సమర్థవంతంగా, చురుకుగా నిర్వర్తించే అవకాశం ఉంటుందని వారు చెబుతున్నారు. ఇలా షార్ట్ స్లీప్ ను యూనివర్సిటీలు, పాఠశాలల్లో ప్రవేశపెడితే విద్యార్థులు మరింత మంచి ఫలితాలు సాధిస్తారని పరిశోధకులు అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News