: టీమిండియా ఓడిందని అంతా బాధపడుతుంటే...ఆ ఒక్కడు సంతోషించాడు


వరల్డ్ కప్, హీరో కప్, టీ20 సిరీస్ ఇలా ఏ టోర్నీ అయినా విజయం సాధించాలని ప్రతి టీమిండియా అభిమాని కోరుకుంటాడు. అలాగే భారత జట్టు గెలవాలని ప్రతి భారతీయుడూ కోరుకుంటాడు. వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా చేతిలో ఘోరపరాజయం చవిచూడడంతో స్టేడియంలో అభిమానులు కన్నీరు కారిస్తే, టీవీల్లో చూసేవాళ్లు మూగబోయారు. కానీ ఒకే ఒక వ్యక్తి మాత్రం టీమిండియా ఓటమిని బలంగా కాంక్షించాడు. తథాస్తు దేవతలు అతని మాటలు వినినట్టున్నారు. అందుకే టీమిండియా ఓటమిపాలైంది. ఆ వ్యక్తి ఎవరో కాదు, ప్రతి అంశంలోనూ వివాదం రేపే దర్శకుడు రాంగోపాల్ వర్మ. భారత జట్టు ఓడినందుకు తాను ఎంతో సంతోషిస్తున్నానని వర్మ ట్వీట్ చేశాడు. దేశాన్ని ప్రేమిస్తాను కనుకే క్రికెట్ ను ద్వేషిస్తానని రామూ చెప్పాడు. క్రికెట్ వల్ల భారతీయులు పనులు మానేస్తున్నారని, టీమిండియాను పదేపదే ఓడిస్తూ, క్రికెట్ పై ఆసక్తి తగ్గిపోయేలా చూడాలని ప్రత్యర్థి జట్లను కోరాడు. క్రికెటైటిస్ అనే అత్యంత ప్రమాదకరమైన వ్యాధి నుంచి దేశాన్ని రక్షించాలని దేవుళ్లందర్నీ ప్రార్థిస్తానని వర్మ ట్విట్టర్లో తెలిపాడు.

  • Loading...

More Telugu News