: చిన్నబోయిన మైదానం...భారతీయ అభిమానుల్లో నిరాశ


ప్రపంచకప్ పోటీ సందర్భంగా స్వదేశానికి మద్దతునిచ్చేందుకు భారతీయులు మెల్ బొర్న్ క్రికెట్ స్టేడియంకి పోటెత్తారు. 42 వేల సామర్థ్యం కలిగిన ఎంసీజీ స్టేడియంలో సుమారు 31 వేల మంది భారతీయ అభిమానులే అంటే టీమిండియాకు స్టేడియంలో మద్దతు ఏ స్థాయిలో లభించి ఉంటుందో అంచనావేయవచ్చు. భారత్ బౌలింగ్ చేసినా, బ్యాటింగ్ చేసినా ఆస్ట్రేలియాలోని ఎంసీజీలో వినిపించిన నినాదం ఒకటే...ఇండియా, ఇండియా, ఇండియా...విదేశాల్లో టీమిండియాకు ఇంత గొప్ప మద్దతు ఇంకెక్కడా లభించలేదంటే అతిశయోక్తి కాదేమో. అభిమాన జట్టును ప్రోత్సహించేందుకు భారతీయులు ఎక్కడెక్కడి నుంచో స్టేడియంకి చేరుకున్నారు. ఎంత ప్రోత్సహించినా టీమిండియా ఆటతీరు తీసికట్టుగా మారడంతో అభిమానులు నిరాశలో కూరుకుపోయారు. కోహ్లీ అవుటవ్వడంతో కొంత మంది అభిమానులు కన్నీరు పెట్టుకోవడం విశేషం. ధోనీ అవుటయ్యాక స్టేడియం 70 శాతం ఖాళీ అయిపోయింది.

  • Loading...

More Telugu News