: చంద్రబాబు మాట్లాడినప్పుడు, కుతూహలమ్మ ఏడుస్తూ వెళ్లారు: జగన్
గతంలో చంద్రబాబు నాయుడు అభ్యంతరకరంగా మాట్లాడినప్పుడు అనాటి డిప్యూటీ స్పీకర్ కుతూహలమ్మ ఏడుస్తూ బయటకు వెళ్లారని వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు. టీడీపీ ఎమ్మెల్యేలు కౌరవుల్లా వ్యవహరించారని ఆమె అన్నారని చెప్పారు. శాసనసభలో మాట్లాడుతూ, ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సభలో తమ సభ్యులు తప్పు చేస్తే సారీ చెప్పడానికి తాము సిద్ధమని తెలిపారు. తమవైపు నుంచి ఇంకోసారి ఇలా జరగకుండా చూస్తామని, అది మా వ్యక్తిత్వమని చెప్పారు.