: నటుడు అవ్వాలనుకుంటే అమితాబ్ ను గమనించాల్సిందే: బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్
"ఇది నాకు చాలా గొప్ప అనుభవం. ఒకవేళ ఏ నటుడైనా నటుడిగా నిరూపించుకోవాలనుకుంటే వాళ్లు తప్పకుండా బిగ్ బీని గమనించాలి. అది తప్పనిసరి. ఆయన విధేయతతో డైరెక్టర్ విజన్ ను అనుసరిస్తారు. ఎల్లప్పుడూ ఉల్లాసంగా ఉంటారు. 'పికు' చిత్రం షూటింగ్ ముగింపు సమయంలో మేమంతా చాలా ఎమోషనల్ అయ్యాం" అని బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ తెలిపారు. ప్రస్తుతం బాలీవుడ్ లో 'పికు' పేరుతో ఓ సినిమా తెరకెక్కింది. అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనె, ఇర్ఫాన్ ఖాన్ ముఖ్య పాత్రల్లో నటించారు. ఇందులో బిగ్ బి, దీపికా కలసి తండ్రి, కూతురు పాత్రల్లో కనిపిస్తారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను ముంబయిలో ఆవిష్కరించిన సందర్భంగా ఇర్ఫాన్ పైవిధంగా మాట్లాడారు.