: తొలి వికెట్ కోల్పోయిన భారత్... ధావన్ ఔట్
ఆస్ట్రేలియాతో జరుగుతున్న సెమీస్ లో 329 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 76 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. 41 బంతుల్లో 45 పరుగులు చేసి ఊపుమీదున్న ధావన్ ఔటయ్యాడు. హాజిల్ వుడ్ బౌలింగ్ లో మ్యాక్స్ వెల్ క్యాచ్ పట్టడంతో ధావన్ పెవిలియన్ చేరాడు. 5 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద లైఫ్ వచ్చినప్పటికీ... ధావన్ దాన్ని భారీ స్కోరుగా మలచలేకపోయాడు. మరో వైపు రోహిత్ శర్మ 24 పరుగులతో క్రీజులో ఉన్నాడు. రోహిత్ కు విరాట్ కోహ్లీ జత కలిశాడు.