: వాద్రా సంస్థ కోసం నాటి కాంగ్రెస్ ప్రభుత్వం నిబంధనలను సడలించింది: కాగ్


కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అల్లుడు, వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రా కంపెనీపై కాగ్ కొత్త విషయాలు వెల్లడించింది. వాద్రాకు చెందిన ఎం/ఎస్ స్కై లైట్ హాస్పిటాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు అనుకూలంగా గత హర్యానా కాంగ్రెస్ ప్రభుత్వం భూ నిబంధనలను సడలించిందని, పలుమార్లు నిర్లక్ష్యంగా వ్యవహరించిందని కాగ్ తన తాజా నివేదికలో స్పష్టం చేసింది. ఈ మేరకు హర్యానా బడ్జెట్ సమావేశాల చివరిరోజున కాగ్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. కేవలం వాద్రా వల్లనే ఇతర డెవలపర్స్, బిల్డర్స్, ప్రధాన డీఎల్ఎఫ్ యూనివర్సల్ లిమిటెడ్ కు నిబంధనలను పూర్తిగా సడలించారని కాగ్ వెల్లడించింది. కాగా డైరెక్టర్ల పేర్లలో వాద్రా పేరుందని తెలిశాక కూడా స్కై లైట్ హాస్పిటాలిటీకి కమర్షియల్ లైసెన్సును ఎలా మంజూరు చేశారని నివేదికలో కాగ్ ప్రశ్నించింది. ఇలా వాద్రాకు సంబంధించి కంపెనీల అవకతవకలను కాగ్ నివేదికలో ఎత్తిచూపింది.

  • Loading...

More Telugu News