: మధ్యాహ్నం కోర్టులో హాజరు కావాలి... డీకే అరుణ కుమార్తె స్నిగ్ధారెడ్డికి హైకోర్టు ఆదేశం


ఈ మధ్యాహ్నం కోర్టుకు హాజరుకావాలని కాంగ్రెస్ తెలంగాణ ఎంఎల్ఏ డీకే అరుణ కుమార్తె స్నిగ్ధారెడ్డికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. భరతసింహారెడ్డి అక్రమ క్వారీపై ఒక కేసు నేడు హైకోర్టులో విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా కోర్టుకు హాజరైన భరతసింహారెడ్డి తన వాదనలు వినిపించారు. ఆయన వాదనపై న్యాయమూర్తి అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఆ క్వారీ స్నిగ్ధారెడ్డి పేరిట ఉండడంతో ఆమె కూడా కోర్టుకు హాజరు కావాల్సిందేనని చెబుతూ, కేసును మధ్యాహ్నానికి వాయిదా వేస్తున్నట్టు జడ్జి తెలిపారు.

  • Loading...

More Telugu News