: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్


వరల్డ్ కప్ మెగా టోర్నీలో భాగంగా మరికాసేపట్లో ప్రారంభం కానున్న రెండో సెమీ ఫైనల్ లో ఆసీస్ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ టాస్ నెగ్గాడు. తొలుత బ్యాటింగ్ ను ఎంచుకున్న క్లార్క్, టీమిండియాను ఫీల్డింగ్ కు ఆహ్వానించాడు. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ ను క్యురేటర్లు బ్యాటింగ్ కు అనుకూలంగా మలచారట. ఈ కారణంగానే క్లార్క్ తొలుత బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. బ్యాటింగ్ కు అనుకూలంగా తీర్చిదిద్దిన ఈ స్టేడియంలో 300 పై చిలుకు స్కోరు నమోదయ్యే అవకాశాలున్నాయన్న విశ్లేషణలు సాగుతున్నాయి. ఇక ఇరు జట్లు ఆటగాళ్లలో ఎలాంటి మార్పులు చేయకుండానే బరిలోకి దిగుతున్నాయి.

  • Loading...

More Telugu News