: ముగిసిన స్పెక్ట్రమ్ వేలం...కేంద్రానికి 1.10 లక్షల కోట్ల ఆదాయం


టెలికాం స్పెక్ట్రమ్ వేలం నేటితో ముగిసింది. ఈ వేలం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి 1.10 లక్షల కోట్ల ఆదాయం సమకూరిందని సమాచారం. ఈ వేలానికి 19 రోజులుగా బిడ్డింగ్ కొనసాగుతోంది. విశ్వసనీయ వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం...బిడ్డర్ల వివరాలను కేంద్రం ఇంకా వెల్లడించలేదు. వేలంపై కేసు నడుస్తుండడంతో వారి వివరాలు బహిర్గతం చేయడానికి సుప్రీంకోర్టు అనుమతి కోరారు. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశిస్తే వారి వివరాలు వెల్లడించనున్నారు.

  • Loading...

More Telugu News