: 'వాట్స్ యాప్ వీడియో' కేసులో తొలి అరెస్ట్


అత్యాచార ఘటనలను వీడియో తీసి వాటిని వాట్స్ యాప్ లో షేర్ చేసుకున్న కేసులో సీబీఐ సుబ్రతా సాహు అనే వ్యక్తిని అరెస్ట్ చేసింది. అభ్యంతరకర వీడియోలు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసినందుకు ఇండియాలో అరెస్ట్ అయిన తొలి వ్యక్తి సాహు కావడం గమనార్హం. సాహూను సీబీఐ అధికారులు భువనేశ్వర్ లో అరెస్ట్ చేశారు. సాహూను అదుపులోకి తీసుకున్న విషయాన్ని 'షేమ్ ది రేపిస్ట్' అంటూ ప్రచారాన్ని ప్రారంభించిన సునీతా కృష్ణన్ స్పష్టం చేశారు. సాహూను నేడు ఢిల్లీకి తరలించనున్నట్టు తెలిసింది. ఒక అత్యాచార బాధితురాలిగా, తన బాధను దాచుకొని మహిళల కోసం ఎన్జీఓ సంస్థను నిర్వహిస్తున్న ఆమె పెట్టిన నిందితుల వీడియోలను సుమోటోగా తీసుకున్న సుప్రీంకోర్టు కేసును సీబీఐకి అప్పగించిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News