: రోజాపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు
నటి, వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజాపై కర్నూలులోని త్రీటౌన్ పోలీస్ స్టేషన్ లో పోతురాజు రవికుమార్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆమెపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. దళితులను రోజా అవమానించారని, ఆమెపై చర్యలు తీసుకోవాలని సదరు వ్యక్తి ఫిర్యాదులో పేర్కొన్నారు.