: ఏపీలో వెంటనే హైకోర్టు ఏర్పాటు చేయండి... వెంకయ్య, సదానంద గౌడకు ఏపీ అడ్వకేట్ జేఏసీ వినతి


ఆంధ్రప్రదేశ్ లో హైకోర్టు ఏర్పాటు చేయాలని ఏపీ అడ్వకేట్ జేఏసీ సభ్యులు కేంద్రానికి విన్నవించారు. ఈ మేరకు ఢిల్లీలో ఈరోజు కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, సదానందగౌడలను వారు కలిశారు. ఆంధ్ర న్యాయవాదులపై దాడుల నేపథ్యంలో వెంటనే కోర్టు ఏర్పాటు చేయాలని కోరారు. కాగా ఏపీలో భవనాలు, నిధుల కొరత ఉన్నందున కేంద్రమే సహాయం చేయాలని జేఏసీ సభ్యులు విజ్ఞప్తి చేశారు. తమ వినతిపై సదానంద హామీ ఇచ్చారన్నారు. ఇదిలాఉంటే తెలంగాణలో కూడా హైకోర్టు ఏర్పాటుపై తీవ్ర ఒత్తిడి వస్తున్న విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News