: మా అంచనాలకు మించి జాతీయ అవార్డులు పొందాము: 'హైదర్' దర్శకుడు


గతేడాది తాను తెరకెక్కించిన 'హైదర్' చిత్రానికి ఏకంగా ఐదు జాతీయ అవార్డులు దక్కడంపై దర్శకుడు విశాల్ భరద్వాజ్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమ చిత్ర బృందానికి అంచనాలకు మించి గౌరవం దక్కిందని పేర్కొన్నారు. "మేము అనుకున్న దానికంటే ఎక్కువగానే అవార్డులు వచ్చాయి. ఐదు జాతీయ పురస్కారాలు పొందాము. నేను చాలా సంతోషంగా ఉన్నా" అని విశాల్ మీడియాతో చెప్పారు. అయితే ఈ సినిమాలో క్లిష్టమైన పాత్రలో అద్భుత నటన కనబర్చిన నటుడు షాహిద్ కపూర్ కు పురస్కారం రాకపోవడం పట్ల దర్శకుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. తను కొంచెం నిరాశకు గురయ్యాడని, షాహిద్ ప్రదర్శన చాలా అద్భుతమని పేర్కొన్నారు. ఈ విషయంలో షాహిద్ పట్ల చాలా బాధపడుతున్నానని భరద్వాజ్ తెలిపారు.

  • Loading...

More Telugu News