: సాక్ష్యం కోసం జిరాక్స్ కాపీలను ఎత్తిపట్టుకుంటున్నా: అసెంబ్లీలో జగన్ వ్యాఖ్య
అసెంబ్లీలో కొద్దిసేపటి క్రితం ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాము ప్రతిపాదించిన వాయిదా తీర్మానాలు, ఇతర అంశాలపై తామిస్తున్న నోటీసుల విషయంలో సాక్ష్యాల కోసం జిరాక్స్ కాపీలను ఎత్తిపట్టుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. రాజధాని అంశంపై చర్చకు తామిచ్చిన రెండు నోటీసులపై అసెంబ్లీ కార్యదర్శిపై నమ్మకం లేకనే జిరాక్స్ కాపీలను తీసిపెట్టుకున్నామని చెప్పిన జగన్, సదరు కాపీలను స్పీకర్ కోడెలకు చూపించారు. జగన్ వ్యాఖ్యలపై స్పీకర్ తో పాటు అధికార పక్షం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో సభలో గందరగోళం నెలకొనగా, సభను స్పీకర్ 15 నిమిషాల పాటు వాయిదా వేశారు.