: ప్రేమ ఫలించక యువజంట ఆత్మహత్య


వారిద్దరూ కలసి చదువుకుంటున్నారు. కలసి బతకాలనుకున్నారు. పెళ్లికి పెద్దలు అంగీకరించలేదో లేదా మరేదైనా కారణం ఉందో కలసి ప్రాణాలు తీసుకున్నారు. ఖమ్మం పట్టణంలో జరిగిన ఈ ప్రేమజంట ఆత్మహత్య సంఘటన సంచలనం సృష్టించింది. నేటి ఉదయం సారథి నగర్‌ దగ్గర యువతీ యువకులు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. మృతులు వరంగల్‌ జిల్లాకు చెందిన బీటెక్‌ విద్యను అభ్యసిస్తున్న కిరణ్మయి, సాయికిరణ్‌ లుగా పోలీసులు గుర్తించారు. మృతదేహాలకు పంచనామా నిర్వహించి మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News