: గోవాలో కూలిన నేవీ విమానం


ఇండియాలో మరో యుద్ధ విమానం కూలిపోయింది. ఈ దుర్ఘటనలో ఒకరు ప్రాణాలతో బయటపడగా మరో ఇద్దరు అధికారులు గల్లంతయ్యారు. నావికా దళానికి సేవలందించే యుద్ధ విమానం గోవాకు నైరుతి దిశగా 25 నాటికల్ మైళ్ల దూరంలో ప్రమాదానికి గురైనట్లు అధికారులు తెలిపారు. గల్లంతయిన వారిలో ఒకరు పైలెట్ కాగా మరొకరు పరిశీలకుడు. రోజువారి శిక్షణా కార్యక్రమాల్లో భాగంగా ఈ విమానం బయలుదేరిందని, నిన్న రాత్రి 11 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే గాలింపు చర్యలు ప్రారంభించామని తెలిపారు.

  • Loading...

More Telugu News