: సహాయక చర్యలు ముమ్మరం...పది హెలికాప్టర్లు, 650 మంది సిబ్బంది


ఫ్రాన్స్ లోని ఆల్ఫ్స్ పర్వతాల్లో కూలిపోయిన 'జర్మన్ వింగ్స్' విమాన శకలాలు, మృత దేహాలను గుర్తించేందుకు ఫ్రాన్స్ సహాయక చర్యలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ప్రమాదం జరిగిన ప్రాంతానికి 10 హెలికాప్టర్లను పంపుతోంది. 350 మంది అగ్నిమాపక సిబ్బంది, 300 మంది సైనికులను ప్రమాద ఘటనాస్థలికి పంపారు. ఒక సైనిక విమానాన్ని కూడా పంపారు. కాగా, సహాయకచర్యలకు సిద్ధమని అమెరికా స్నేహహస్తం చాచింది. ప్రమాదం జరిగిన విమానంలో అమెరికన్లు ఎవరైనా ఉన్నారా? అనే అంశంపై అమెరికన్ వర్గాలు, జర్మన్ వింగ్స్ ప్రతినిధులతో చర్చించారు.

  • Loading...

More Telugu News