: 17 ఫుడ్ పార్కులు కేటాయించిన కేంద్రం
కేంద్ర ప్రభుత్వం 17 ఫుడ్ పార్కులను కేటాయించింది. రాష్ట్రాలకు 7, ప్రైవేటు సంస్థలకు 10 ఫుడ్ పార్కులను కేటాయించింది. వీటిలో మూడు ఫుడ్ పార్క్ లను తెలుగు రాష్ట్రాలకు కేటాయించింది. తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో ప్రభుత్వం ఆధ్వర్యంలో ఓ ఫుడ్ పార్క్, మహబూబ్ నగర్ జిల్లాలో ప్రైవేటు సంస్థల ఆధ్వర్యంలో ఒక ఫుడ్ పార్కును కేటాయించింది. ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లాలో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఫుడ్ పార్క్ కు అనుమతి ఇచ్చింది.