: మూడు దేశాలు కలిపి దర్యాప్తు చేస్తాయి: జర్మనీ ఛాన్సలర్
ఫ్రాన్స్ లోని ఆల్ఫ్స్ పర్వతాల్లో 'జర్మన్ వింగ్స్'కు చెందిన ఎయిర్ బస్ విమాన ప్రమాదంపై జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మోర్కెల్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంపై ఆమె మాట్లాడుతూ, జర్మనీ, ఫ్రాన్స్, స్పెయిన్ దేశాలు సంయుక్తంగా దర్యాప్తు చేస్తాయని అన్నారు. విమాన ప్రమాద ప్రదేశానికి రేపు వెళ్తానని ఆమె పేర్కొన్నారు. ఇప్పటికే అక్కడికి ఫ్రాన్స్ వైమానిక దళానికి చెందిన హెలికాప్టర్ చేరుకుందని ఆమె చెప్పారు. ఈ ప్రమాదం అత్యంత తీవ్రమైనదని ఆమె పేర్కొన్నారు. కాగా, 1981లో కొర్సికాలో జరిగిన విమాన ప్రమాదంలో 180 మంది ప్రాణాలు కోల్పోయారు.