: విమానం కూలిన ప్రదేశానికి బయల్దేరిన ఫ్రాన్స్ ప్రధాని
ఫ్రాన్స్ లోని ఆల్ఫ్స్ పర్వత ప్రాంతంలో ఎయిర్ బస్ ఏ320 విమానం క్రాష్ అయిన సంగతి తెలిసిందే. ఈ ఘటన జరిగిన ప్రదేశానికి ఫ్రాన్స్ ప్రధాని మాన్యుల్ వాల్స్ బయలుదేరారు. విమానం కూలిన సమయంలో వాతావరణంలో ఎలాంటి సమస్యలు లేవని ఫ్రాన్స్ వాతావరణ శాఖ ప్రకటించింది. ఇంజిన్ లో లోపం లేదా మంటల వల్ల విమానం కూలి ఉండవచ్చని ఊహిస్తున్నారు. 33వేల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న విమానం ఒక్కసారిగా 6,800 అడుగుల దిగువకు వచ్చిందని, ఆ వెంటనే రాడార్ తో సంబంధాలు తెగిపోయాయని అధికారులు తెలిపారు.