: వైసీపీ సభ్యులపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చిన అధికారపక్షం
ప్రతిపక్ష వైఎస్సార్సీపీకి చెందిన 9 మంది సభ్యులపై అధికార పక్ష సభ్యులు స్పీకర్ కోడెల శివప్రసాద్ కు ఫిర్యాదు చేశారు. సభా కార్యక్రమాలకు తరచూ అడ్డుపడుతున్నారంటూ వారిపై టీడీపీ సభ్యులు సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు. శ్రీకాంత్ రెడ్డి, చెవిరెడ్డి, కొడాలి నాని, అనిల్ కుమార్, రోజా, శ్రీధర్ రెడ్డి, శివప్రసాద్ రెడ్డి, పిన్నెల్లి, ముత్యాల నాయుడులను ఆరు నెలల పాటు సస్పెండ్ చేయాలని స్పీకర్ కు విజ్ఞప్తి చేశారు. అయితే సరైన ఫార్మాట్ లో రావాలని అధికారపక్ష సభ్యులకు స్పీకర్ సూచించారు. అనంతరం సభ రేపటికి వాయిదా పడింది.