: ఎంపీ అసదుద్దీన్ పై ఢిల్లీ కోర్టులో కేసు


ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీపై ఢిల్లీ కోర్టులో కేసు నమోదైంది. గతేడాది జూన్ 5న ఢిల్లీలో ప్రసంగించిన ఆయన ఓ వర్గం ప్రజలను కించపరిచే విధంగా మాట్లాడారంటూ సామాజిక కార్యకర్త అజయ్ గౌతమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రసంగం సందర్భంగా ఒవైసీ తీవ్ర స్థాయిలో రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారని తెలిపారు. దాంతో దేశ సౌభ్రాతృత్వానికి భంగం కలిగించేలా ప్రసంగించినందుకుగానూ 153ఏ, 120బీ, 121 సెక్షన్ల కింద కేసు నమోదైంది.

  • Loading...

More Telugu News