: రేపు సింగపూర్ వెళుతున్న చంద్రబాబు... లీక్వాన్ యూకు నివాళులర్పించనున్న సీఎం
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 25న సింగపూర్ పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు. సింగపూర్ జాతిపిత లీక్వాన్ యూకు బాబు నివాళులర్పించనున్నారు. ఆయన కుటుంబసభ్యులను పరామర్శిస్తారు. పర్యటనలో చంద్రబాబు వెంట ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్, ప్రిన్సిపల్ సెక్రటరీ సతీష్ చంద్ర వెళ్లనున్నారు. తిరిగి 26న రాష్ట్రానికి తిరిగి వస్తారు. కొంతకాలంగా న్యుమోనియాతో బాధపడుతున్న లీక్వాన్ నిన్న (సోమవారం) మరణించారు. ఆయన భౌతికకాయాన్ని ఈ నెల 28 వరకు పార్లమెంటు హౌజ్ లో ఉంచనున్నారు. 29న అంత్యక్రియలు జరుగుతాయి.