: ఏపీ అసెంబ్లీ తీరుపై టీఎస్ మంత్రి హరీష్ సెటైర్లు... మరి, వారు చేసిందేమిటి?
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ జరుగుతున్న తీరుపై తెలంగాణ మంత్రి హరీష్ రావు విమర్శలు గుప్పించారు. అసెంబ్లీలో విపక్ష సభ్యులు మాట్లాడటానికి అవకాశం కూడా ఇవ్వడం లేదని అన్నారు. అసెంబ్లీ సమావేశాలు కాకుండా... తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్ష సమావేశం జరుగుతున్నట్టు అనిపిస్తోందని సెటైర్ వదిలారు. కానీ, తెలంగాణ శాసనసభ సమావేశాలు మాత్రం చాలా హుందాగా కొనసాగుతున్నాయని కితాబిచ్చుకున్నారు. విపక్ష సభ్యులు మాట్లాడేందుకు ఎంతో సమయాన్ని కూడా ఇస్తున్నామని చెప్పుకొచ్చారు. అయితే, టీటీడీపీ సభ్యులను మొత్తం సెషన్ నుంచి సస్పెండ్ చేసిన విషయం గురించి మాత్రం ఆయన మాట్లాడక పోవడం విశేషం.