: అసెంబ్లీ గౌరవ మర్యాదలు తెలియకుండా జగన్ మాట్లాడుతున్నారు: అనం వివేకా
వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై కాంగ్రెస్ నేత ఆనం వివేకానందరెడ్డి మండిపడ్డారు. అసెంబ్లీ గౌరవ మర్యాదలు తెలియకుండా జగన్ మాట్లాడుతున్నారన్నారు. లోటస్ పాండ్ లో బడ్జెట్ గురించి ప్రసంగించడం సరికాదని తెలిపారు. పట్టిసీమ ప్రాజెక్టు హేతుబద్ధం కాదని జగన్ అనడం సరికాదని, పట్టిసీమతో లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని పేర్కొన్నారు. మరోవైపు ప్రస్తుత ఏపీ అసెంబ్లీలో సభ్యుడిగా లేనందుకు తాను సంతోషిస్తున్నానని ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. విలువలను కాపాడుకుంటూ ఎంతవరకైనా పోరాడవచ్చన్నారు. సభలో తిట్లు, అసభ్య పదజాలం సరికాదని జేసీ హితవు పలికారు.