: నేనూ వైయస్ కేబినెట్లో పనిచేశా... అయినా అడుగుతున్నా, జగన్ కు ముప్పై కంపెనీలు ఎలా వచ్చాయి?: గొల్లపల్లి
ఈ రోజు శాసనసభలో టీడీపీ ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు వైకాపా అధినేత జగన్ పై మండిపడ్డారు. దివంగత రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి కాకముందు వారికి ఒక్క వ్యాపారం కూడా లేదని... కానీ, ఆయన సీఎం అయిన తర్వాత జగన్ కు ఇరవై నుంచి ముప్పై కంపెనీలు ఎలా వచ్చాయని నిలదీశారు. ఆనాడు ప్రభుత్వం ఏ స్థాయిలో అవినీతిలో కూరుకుపోయిందో చెప్పడానికి ఇదొక నిదర్శనమని చెప్పారు. తాను కూడా అప్పట్లో వైయస్ కేబినెట్లో పనిచేశానని, అయినా ఇప్పుడు ప్రశ్నిస్తున్నానని అన్నారు. ఏపీలోని వనరులను దోచేశారని ఆవేదన వ్యక్తం చేశారు.