: చంద్రబాబు జపాన్ పర్యటనకు అయిన ఖర్చు ఎంతో తెలుసా?
నవ్యాంధ్రప్రదేశ్ ను దేశంలోనే నెంబర్ వన్ చేస్తామంటూ... పెట్టుబడులు, ప్రాజెక్టుల కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు విదేశీ పర్యటనలు భారీగానే చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన జపాన్ కూడా పర్యటించారు. ఆయనతో పాటు పలువురు సంబంధిత మంత్రులు, ఉన్నతాధికారులు కూడా వెళ్లారు. అయితే, ఆయన జపాన్ పర్యటనకు అయిన ఖర్చు ఎంతో తెలుసా? అక్షరాలా రూ. 1.88 కోట్లు. ఇందులో అప్పట్లోనే కోటిన్నర రూపాయలను విడుదల చేశారు. ఇప్పుడు తాజాగా మరో రూ. 37.79 లక్షలను మంజూరు చేశారు. రాష్ట్రాభివృద్ధి కోసం, పెట్టుబడులను ఆకర్షించడం కోసం ఆయన విదేశీ పర్యటనలు చేయడం అవసరమే. అయితే, ఆయన కష్టానికి ఫలితం దక్కి ప్రాజెక్టులు వస్తే అందరూ హర్షిస్తారు. అనుకున్నది సాధించకపోతే మాత్రం విమర్శలపాలు కావడం ఖాయం.